నో హెల్మెట్ – నో పెట్రోల్..

నో హెల్మెట్ – నో పెట్రోల్..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పెట్రోల్ బ్యాంకుల యజమానులందరూ తప్పనిసరిగా ప్రమాదాల నివారణ కోసం తగిన జాగ్రత్తలు పాటించాలని చౌటుప్పల్ డి.ఎస్.పి పటోళ్ల మధుసూదన్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని అన్నీ పెట్రోల్ బంక్ ల యజమానులతో డీస్పీ మధుసూదన్ రెడ్డి తన కార్యాలయంలో యాక్సిడెంట్స్ కు సంబంధించి అరైవే, అలైవే ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్పి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. నో హెల్మెట్ – నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ – నో పెట్రోల్, డీజిల్, కార్, బండిలోనే పెట్రోల్/డీజిల్ కొట్టాలి. బాటిల్ లో, క్యాన్ లలో ఎట్టి పరిస్థితిలో కొట్టరాదు. ప్రతి బంకులో సీసీ కెమెరాలు అమర్చాలి. ఆ కెమెరాలు రోడ్డు కూడా కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి బంక్ యజమాని ఈ జాగ్రత్తలు తీసుకోవాలని డి.ఎస్.పి తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని అన్ని పెట్రోల్ బంక్ ల యజమానులు, చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధకుమార్, యస్.ఐ లు కనకటి యాదగిరి, కె ఉపేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply