No Dollar : టోల్ కట్టాల్సిందే Andhra Prabha News

No Dollar : టోల్ కట్టాల్సిందే Andhra Prabha News
- డాలరు వద్దు
- యువాన్, డిజిటల్ కరెన్సీ ఓకే
- ఇదీ ఇరాన్ నిర్ణయం
- హోర్ముజ్ ఓపెన్
- మిత్రదేశాల నౌకలకే అనుమతి
- భారత్, చైనా, రష్యా కు గ్రీన్ సిగ్నల్
- ఇరాక్ పై ఆంక్షల ఎత్తివేత
- శత్రుదేశాల నౌకలకు నో ఎంట్రీ క
- గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం.. చమురు రవాణాలో మార్పులు
- అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం
( ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి)

హోర్ముజ జలసంధిని తెరవక పోతే… ఇరాన్ పై నరకం వర్షం కురిపిస్తానని అమెరికా అధ్యక్షుడు డెడ్ లైన్ విధించగా.. ప్రపంచ దేశాలను ఆకట్టుకునే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేసింది. ఈ జలసంధి మీదుగా ప్రయాణించే కీలక దేశాల్లో.. పెద్ద దేశాలతో మైత్రి బంధం పెంచుకుంది. సోమవారం రాత్రితో ట్రంప్ డెడ్ లైన్ ముగుస్తుంది.. ఆది వారం ఉదయమే.. ఇరాన్ హోర్ముజ్ తాళాలు తెరిచింది. కానీ.. మిత్ర రాజ్యాలకే రాకపోకల అవకాశం కల్నించింది.
No Dollar : ఆ రెండు దేశాలూ నో..

ఇరాన్ తన వ్యూహాత్మక జలసంధి హోర్ముజ్ (Strait of Hormuz) లో కొన్ని దేశాల నౌకల రాకపోకలకు కీలక నిర్ణయాలు తీసుకుంది. తనపై దాడులు చేయని “మిత్రదేశాల” (Friendly Nations) నౌకలకు మాత్రమే ఈ జలసంధి గుండా వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. భారతీయ గ్యాస్ (LPG) ట్యాంకర్లు చమురు నౌకలకు ఇరాన్ ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. ఇరాక్ నౌకలపై అన్ని రకాల ఆంక్షలను ఇరాన్ నేడు తొలగించింది. ఇరాక్ పట్ల తమకు గౌరవం ఉందని, ఆ దేశ నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అందుకు ఇరాన్ కూడా కృతజ్ఞతలు తెలిపింది. చైనా వాణిజ్య నౌకలకు కూడా అనుమతి లభించింది. ఇరాన్ సహకారంతో రష్యా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించవచ్చు.20 పాకిస్థాన్ నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పించింది. ఆహారం, మందులు మరియు పశుగ్రాసం వంటి అత్యవసర వస్తువులను తీసుకెళ్లే నౌకలకు ఇరాన్ అనుమతిని ధృవీకరించింది. భారత్ వంటి దేశాలకు చమురు సరఫరా చేసే ట్యాంకర్లు ఇరాన్ రక్షణ దళాల (IRGC) సమన్వయంతో ప్రయాణిస్తున్నాయి.
No Dollar : డాలరుకు ఎసరు

అమెరికా ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలకు వాటి మిత్రదేశాల నౌకలపై ఇరాన్ కఠిన ఆంక్షలను కొనసాగిస్తోంది. ఈ దేశాల నౌకలు కనిపిస్తే దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ జలసంధి ద్వారా వెళ్లే నౌకల నుంచి ఐఆర్జీసీ దళాలు రుసుము (Toll) వసూలు చేయడం ప్రారంభించాయని సమాచారం. ఈ రుసుమును అమెరికన్ డాలర్లకు బదులుగా చైనా యువాన్ (Yuan) లేదా డిజిటల్ కరెన్సీల్లో చెల్లించాలని కోరుతున్నాయి.
