No. 136 | ప్ర‌భుత్వ భూమి స్వాధీనం

No. 136 | ప్ర‌భుత్వ భూమి స్వాధీనం

No. 136 | ఖమ్మం, ఆంధ్ర‌ప్ర‌భ : ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలోఎదులాపురం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 136(Survey No. 136)లో గతంలో భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకునేందుకు పట్టాలు ఇచ్చారు. ఆ ప్రభుత్వ భూమిలో ఇప్పటి వరకు ఎలాంటి సాగు చేయక పోవడంతో రెండకరాల భూమిని రెవెన్యూ అధికారులు(Revenue Officers) తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ అవసరాలకు సరిపడా భూమి లేదని ఇప్పుడు స్వాధీనం చేసుకున్న భూమిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తామ‌ని తెలిపారు. ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన బోర్డుల‌ను తొలగించే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామ‌ని తహసీల్దార్ రామ్ ప్రసాద్(Tehsildar Ram Prasad) హెచ్చ‌రించారు.

Leave a Reply