NLGD | రైతులకు ఇబ్బందులు కలిగించకండి…
- సివిల్ సప్లై డి ఎం హరికృష్ణ
మోత్కూరు, నవంబర్ 20 (ఆంధ్రప్రభ): ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయొద్దని సివిల్ సప్లై డీఎం హరికృష్ణ స్పష్టం చేశారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని రైస్ మిల్లులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పొడిచేడు గ్రామంలో సింగిల్ విండో పర్యవేక్షణలో సాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒక రైతు ధాన్యం అకాల వర్షాల కారణంగా రంగు మారినందున మిల్లర్లు కొనుగోలు చేయడానికి నిరాకరించిన విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
సదరు రైతు ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేయాలని మిల్లర్లకు డీఎం హరికృష్ణ ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటరమణారెడ్డి, ఏఓ కీర్తి, సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, బ్యాంక్ సీఈఓ వరలక్ష్మీ, ఏఈఓ గోపీనాథ్‌తో పాటు మిల్లర్లు సోమ నర్సయ్య, మిట్టపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.

