Nizamabad | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Nizamabad | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Nizamabad | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మర్ పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ పాలేపు నర్సయ్య(Palepu Narsaiya), అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్(Sunkari Vijay Kumar) మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మహోన్నతమైనదని పేర్కొన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు పౌరులు గుర్తెరిగి రాజ్యాంగం పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు.

భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మక లిఖిత గ్రంథం, ప్రత్యామ్నాయ భావజాలంతో కూడిన దేశ అభివృద్ధికి సంబంధించినధని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) పూర్తీ సమయాన్ని, తన మేధస్సును రాజ్యాంగ రచనకి కేంద్రీకరించారని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలారం సుధాకర్, నిమ్మ రాజేంద్రప్రసాద్, సన్నీ, నరేష్, రాములు, వినయ్, క్రిష్ణ మూర్తీ, రామంజి, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply