Nirmala Sitharaman |పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
- దివ్యాంగులకు అండగా కార్యక్రమాలు
- ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman |వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. స్వాతంత్ర్య భారతావని చరిత్రలో కేంద్ర బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. టెక్నాలజీ పూర్తిస్థాయిలో సామాన్యుడికి ఉపయోగపడాలని ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు. 21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీదే అని వ్యాఖ్యానించారు. దివ్యాంగులకు అండగా ఉండేలా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశవ్యాప్తంగా 21 వాటర్‌వేస్ అభివృద్ధి చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
