Nirmal | వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్

నిర్మల్ ప్రతినిధి, ఫిబ్రవరి 27 (ఆంధ్రప్రభ) : జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సమయానుసారంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ కేంద్రాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలను తెలుసుకోవాలన్నారు. అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.

Leave a Reply