NH 65 road | రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

NH 65 road | రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
NH 65 road | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ – విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలంలో సంక్రాంతి సెలవుల సందర్భంగా ట్రాఫిక్(Traffic) నిలిచిపోకుండా ఉండడం కోసం ధర్మోజి గూడెం స్టేజి వద్ద పీసీ 4434 భరద్వాజతో కలిసి విధులు నిర్వహిస్తున్న పీసీ 184 కోల నరేష్ కుమార్ ను గుర్తు తెలియను వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.
సోమవారం రాత్రి క్రైమ్ బీసీ డ్యూటీలో భాగంగా సంక్రాంతి పండుగ సందర్భంగా రోడ్లపై వాహనాలు ఆగితే దొంగతనాలు జరుగుతాయని ముందు జాగ్రత్తగా చౌటుప్పల్ బస్టాండ్ ఏరియా నుండి బోర్రెలగూడెం గ్రామం స్టేజి వరకు ఎన్ హెచ్ 65 రోడ్డు(NH 65 road) వెంట క్రైమ్ బీసీ వెహికల్ నెంబర్ టీఎస్ 05 పిఏ 6926 పై భరద్వాజ్ పిసి 4434 వెహికల్ నడుపుతూ వెనకాల నరేష్ కుమార్ పీసీ184 కూర్చుని గస్తీ నిర్వహిస్తుండగా ఈ రోజు తెల్లవారుజామున గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
ధర్మోజిగూడెం స్టేజ్ సమీపంలో తిరుమల వెంచర్ ఆర్చి వద్దకు చేరుకోగా హైదరాబాద్ నుండి విజయవాడ రూట్‌లో వాహనాలు ఆగినట్లుగా అనిపించి రోడ్డు పక్కన బైకు ఆపి పీసీ నరేష్ కుమార్, (38) బైక్ దిగి రోడ్డు అవతలకు దాటుచుండగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళు రోడ్డులో గుర్తుతెలియని వాహనం డ్రైవర్(driver) అతివేగంగా జాగ్రత్తగా వాహనం నడిపి నరేష్ కుమార్‌కి ఢీ కొనగా తలకు, ఇంకా ఇతర శరీర భాగాలకు బలమైన రక్త గాయాలు అయ్యి అక్కడికక్కడే మరణించాడు.
ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. మునగాల మండలం ఎస్ఎం పేట గ్రామానికి చెందిన మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు 1. లాస్య, 2. వర్షిణి, ఒక బాబు 3. క్రాంతి మనిత్ ఉన్నారు. విధినిర్వహణలో ఉన్న సహచర కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో మృతుని కుటుంబంతో పాటు పోలీస్ వర్గాలలో విషాదఛాయలు అలముకున్నాయి.
