ట్రంప్‌ నోటికి న్యూయార్క్ తాళం

  • తప్పదు ఇక మౌనం

ఇంటర్‌‌నేషనల్‌, ఆంధ్రప్రభ : అమెరికాలో ఏక‌ప‌క్ష‌ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేస్తూ ఓ నియంత‌లా ప‌నిచేస్తున్నఅమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ న‌గ‌ర ప్ర‌జ‌లు గ‌ట్టి బుద్ధి చెప్పారు. న్యూయార్క్ మేయ‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ట్రంప్‌ క‌ళ్లు తెరుస్తారా? అనేది ప్ర‌పంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి.

అమెరికాలో ట్రంప్ చేప‌డుతున్న సంస్క‌ర‌ణాల‌కు ఇంటా, బ‌య‌టా పోరును ఎదుర్కొంటున్నారు. విదేశాల‌పై ఉన్న కక్ష‌తో టారిఫ్‌లు పెంచుకుంటూ వెళుతున్న అమెరికా అధ్య‌క్షుడి ట్రంప్ అమెరికాలో ధ‌ర‌లు పెరుగుతున్న విష‌యాన్ని గుర్తించ‌లేదు. ఒక ప‌క్క టారిఫ్‌ల‌తో పాటు హెచ్‌-1బీ వీసా ఫీజు ల‌క్ష డాల‌ర్ల‌కు పెంచారు.

ఈ విష‌యామై అమెరికా ప్ర‌జ‌ల్లో ట్రంప్‌పై వ్య‌తిరేక ప‌వ‌నాలు ప్రారంభించాయి. అయినా ఎవ‌రి మాట లెక్క‌చేయ‌లేదు. అమెరికాలో హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ కోర్టును ఆశ్ర‌యించ‌గా, అక్క‌డి ప్ర‌జా ప్ర‌తినిధులు ట్రంప్‌కు లేఖ రాశారు. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ అంశం కూడా ఓట‌ర్ల మీద ప్ర‌భావం ప‌డింది.

అదే ఆమెకు బాగా కలిసొచ్చింది. ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకం కావడంతో తన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. “మమ్దాని గెలిస్తే న్యూయార్క్‌కు ఇచ్చే ఫెడరల్ నిధులను తగ్గిస్తాను, నగరానికి బతుకే అవకాశం ఉండదు” అని భ‌రోసా కూడా ఇచ్చారు.

తన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే న్యూయార్క్ కు భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తానంటూ ఓట‌ర్ల‌ను న‌మ్మ‌బ‌లికారు. అయినా ఓట‌ర్లు ట్రంప్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. అయినా ట్రంప్ మేల్కొలేదు. ఇంత‌టిలో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ట్రంప్ పార్టీకి న్యూయార్క్ ప్ర‌జ‌లు షాకిచ్చారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తోనైనా ట్రంప్ క‌ళ్లు తెరుస్తారో? లేదో? చూడాలి.

ట్రంప్ కు షాకిచ్చింది భార‌తీయ సంత‌తికి చెందిన‌వాడు…

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చింది భార‌తీయ సంత‌తికి చెందిన వాడే. ముఖ్యంగా అధికార రిపబ్లిక్ పార్టీకి కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవిని ఆ పార్టీ కోల్పోయింది. మేయ‌ర్‌గా డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీకి ఓట‌ర్లు ప‌ట్టం క‌ట్టారు.

ట్రంప్ తీసుకొచ్చిన ప్రాంతీయ‌వాదం ఏమాత్రం ప‌నిచేయ‌లేదు. అలాగే సంస్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌తికూల ప్ర‌భావం చూపించింది. వర్జీనియాలో సైతం రిపబ్లిక్ పార్టీకి చుక్కెదురైంది. ఇక్కడ డెమోక్రటిక్ పార్టీకి చెందిన అబిగైల్ స్పాన్‌బెర్గర్ గెలుపొందారు. ఇక్క‌డ భారతీయులు కూడా ఎక్కువ మంది ఉన్నారు.

న్యూయార్క్ న‌గ‌ర మేయ‌ర్ విష‌యానికి వ‌స్తే డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన భార‌తీయ సంత‌తికి చెందిన జోహ్రాన్ మ‌మ్దానీ చారిత్రాత్మ‌క విజ‌యం సాధించారు. క్వీన్స్‌కి చెందిన 34 ఏళ్ల రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు జోహ్రాన్ మమ్దానీకి న్యూయార్క్ఓట‌ర్లు ప‌ట్టం క‌ట్టారు.

మేయ‌ర్ ఎన్నిక‌ల్లో అధికార రిపబ్లిక్ పార్టీకి చెందిన క్యూమోకు 41.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మమ్దానీకి 49.06 ఓట్లు పడ్డాయి. మమ్దానీ కి 8.04 శాతం ఓట్లు అంటే దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు.

ఏడేళ్ల వయస్సు నుంచి అమెరికాలో ఉంటున్న ఆయన 2018లో పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అబిగైల్ స్పాన్‌బెర్గర్ కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అబిగైల్ స్పాన్‌బెర్గర్‌కు 14.8 లక్షల ఓట్లు , ఆమె ప్రత్యర్థి సీయర్స్ కు 11.6 లక్షల ఓట్లు వచ్చాయి. స్పాన్‌బెర్గర్ తన ప్రచారంలో అధ్యక్షుడు ట్రంప్ విధానాలను నిరసిస్తూ తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు.

రికార్డులు !!

న్యూయార్క్ మేయ‌ర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ భార‌తీయ సంత‌తికి చెందిన‌వాడు అతి త‌క్కువ వ‌య‌స్సుగ‌ల వ్యక్తి తొలి ముస్లిం వ్యక్తి మేయర్ ఎన్నికల్లో 1969 తర్వాత భారీ స్థాయిలో పోలింగ్‌ నమోదు కావడం.

వాట్స్ నెక్ట్స్‌..

ట్రంప్‌.. వాట్ ఈజ్ నెక్ట్స్ అనేది అమెరికా ప్ర‌జానీకంతోపాటు ప్ర‌పంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇప్ప‌టికైనా ట్రంప్ మారుతారా? లేదా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అమెరికాలో రెండోసారి అధ్య‌క్షుడుగా చేప‌ట్టిన డోనాల్డ్ ట్రంప్ ప్ర‌జ‌ల కోసం ప‌ట్టించుకోకుండా ప్ర‌పంచ దేశాల్లో ఆదిప‌త్యం కోసం నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తూ టారిఫ్ వేస్తునే ఉన్నారు.

అలాగే హెచ్‌1బీ వీసా ఫీజు పెంపు, అమెరికాలో ష‌ట్‌డౌన్ త‌దిత‌ర అంశాల‌ను కూడా అమెరికా ప్ర‌జ‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. న్యూయార్క్ మేయ‌ర్ ఎన్నిక‌, వ‌ర్జీనియ గ‌వ‌ర్న‌ర్ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు ట్రంప్‌కు కంగుతినిపించారు. దీంతో ట్రంప్ మౌనం వ‌హించాల్సి ఉంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఏడాది తిర‌గ‌క ముందే జ‌రిగిన ఈ ఎన్నిక‌ల‌న రిఫ‌రెండంగా స్వీక‌రించి ట్రంప్ మారుతారా? లేదా అనేది ఎదురు చూడాలి.

Leave a Reply