New Building | కల సాకారం..

New Building | కల సాకారం..

  • ఏడీసీసీ బ్యాంకు నూతన భవన నిర్మాణం
  • భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అమిలినేని, బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి
  • రైతులకు మరింత అందుబాటులో బ్యాంకు సేవలు : అమిలినేని

New Building | అనంతపురం, ఆంధ్ర‌ప్ర‌భ : ఏడీసీసీ బ్యాంకు ఏర్పడిన నాటి నుంచి సొంత భవనం లేక‌పోవ‌డంతో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు ఇబ్బంది ప‌డ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సొంత భవనం కల సాకారం కాబోతోందని, తద్వారా ఈ ప్రాంతంలో ఏడీసీసీ బ్యాంకు కార్యకలాపాలు మరింత మెరుగై ఖాతాదారులకు సేవలు అందుతాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు.

New Building

నేడు కళ్యాణదుర్గం బ్రాంచి నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, సీఈఓ సురేఖ రాణి, చాపిరి సింగిల్ విండో చైర్మన్ మల్లిపల్లి నారాయణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్, మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ళ లక్ష్మీదేవి రమేష్, మున్సిపల్ చైర్మన్ తలారి గౌతమి సోమశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, యల్లనూరు సొసైటీ చైర్మన్ అనిల్ కుమార్, బండమీదపల్లి సొసైటీ చైర్మన్ చిత్రలింగప్ప, శెట్టూరు సొసైటీ చైర్మన్ రంగప్ప చౌదరి, కంబదూరు సొసైటీ చైర్మన్ బాబయ్య, బ్రహ్మాసముద్రం సొసైటీ చైర్మన్ అంకె ఓబులేష్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కోనంకి రాజశేఖర్, జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, బీజేపీ నాయకుడు మల్లారెడ్డి, మండల పార్టీ నాయకులు గోళ్ళ వెంకటేషులు, ధనుంజయ, పాలబండ్ల శ్రీరాములు, కురుబ శివన్న, టీఆర్ తిప్పేస్వామి, టీడీపీ నాయకులు పాల్గొని నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.

Leave a Reply