Nellore | వ్యభిచార ముఠా గుట్టురట్టు..

Nellore | వ్యభిచార ముఠా గుట్టురట్టు..

Nellore, ఆంధ్రప్రభ : నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ పరిధిలోని ఓ ఇంటిలో వ్యభిచారం జోరుగా సాగుతోందన్న సమాచారంతో పోలీసులు (Police) శనివారం అర్థరాత్రి దాడి చేసారు. వ్యభిచారానికి పాల్పడుతున్న మహిళలతో పాటు విటులు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో వ్యభిచారం జోరుగా సాగుతోందన్న పక్కా సమాచారంతో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తన బృందంతో కలిసి దాడి చేసి గుట్టు రట్టు చేసారు. పట్టుబడిన వారిని స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply