NDBL | పత్తి మిల్లులో అగ్నిప్రమాదం

NDBL | పత్తి మిల్లులో అగ్నిప్రమాదం

  • కోట్ల రూపాయల ఆస్తి నష్టం అంచ‌నా

NDBL | ఆదోని, ఆంధ్ర‌ప్ర‌భ‌ ప్రతినిధి : ఆదోని పట్టణ శివారులో మరోసారి పత్తి జిన్నింగ్ పరిశ్రమలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. సిరుగుప్ప క్రాస్‌రోడ్డులో ఉన్న ఎన్‌డీబీఎల్(NDBL) పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఈ రోజు తెల్లవారుజామున మంటలు చెలరేగి ప‌త్తి ద‌గ్ధ‌మైంది. ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన పత్తి బేడలు, యంత్రాలు, గోదాములు మంటల్లో చిక్కుకోవడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. మంటలు భారీగా వ్యాపిస్తుండడంతో అదుపులోకి తీసుకోవడానికి ఫైర్‌టెండర్లు(fire tenders) క్షణక్షణం శ్రమిస్తున్నారు. మూడు రోజుల కిందట హరి పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీ(ginning factory)లో జరిగిన అగ్ని ప్రమాదం మరవకముందే మరో జిన్నింగ్ కేంద్రంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply