నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి

నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క…


బిక్కనూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోరబండ (Borabanda) డివిజన్ లో ఆమెతో పాటు బిక్కనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇతర పార్టీలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని వారు సూచించారు. వారు నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది.

Leave a Reply