వర్షంలోనూ ప్రచారం చేస్తోన్న నవీన్ యాదవ్

వర్షంలోనూ ప్రచారం చేస్తోన్న నవీన్ యాదవ్

శ్రీనగర్ కాలనీ, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ(Somajiguda) డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడ, ఇమామ్‌గూడ.. అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ అవేమి లెక్క చేయకుండా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఓ వైపు వర్షంలో తడుస్తూనే ప్రతి ఇంటి వద్దకు చేరుకుంటూ ప్రజలతో మమేకమైతూ వారితో ఆత్మీయంగా మాట్లాడి, వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 11న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) చేతి గుర్తు పైన ఓటు వేసి, వేయించి భారీ మెజార్టీతో గెలిపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలందరూ తోడ్పడాలని నవీన్ యాదవ్ కోరారు.

ఈ కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ ఇన్చార్జి భువనగిరి, ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy), తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల గద్దర్, కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్, రియాజ్, గొంటి సాయి యాదవ్, స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply