గుర్తు తెలియని వాహనం ఢీ…

గుర్తు తెలియని వాహనం ఢీ…
వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల సమీపంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పై రాగాయిపల్లి గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కుప్పగండ్ల గ్రామానికి చెందిన కూర వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఘటన స్థలం చేరుకున్న ట్రాఫిక్ ని నియంత్రించి మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు .
