Narsimhulapeta | పరిసరాల శుభ్రత ప్రధానం..

Narsimhulapeta | పరిసరాల శుభ్రత ప్రధానం..
- నర్సింహులపేట గ్రామ సర్పంచ్ పెదమామూల యాకయ్య
Narsimhulapeta | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సింహులపేట గ్రామ సర్పంచ్ పెదమామూల యాకయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు వెంట ఉన్న మురుగు కాల్వల్లో చెత్తను తీసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ కాస యాకయ్య, వార్డు సభ్యులు ఎల్లావుల ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు వేముల రవి కుమార్, కారోబార్ రమేష్ తదితరులు ఉన్నారు.
