Narsampeta Rural | 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

Narsampeta Rural | నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట నియోజకవర్గంలోని వివిధ19 గ్రామ పంచాయతీల్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, సర్పంచులు గ్రామ ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసాలు చేశారు. సర్పంచులు తమ ప్రసంగాల్లో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించారు.

ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి కొరత, డ్రైనేజీ వ్యవస్థల అస్తవ్యస్తత, రోడ్ల దుస్థితి, ఉపాధి అవకాశాల కొరత, పారిశుధ్య సమస్యలు, పాఠశాలలు. అంగన్వాడీలకు మౌలిక సదుపాయాల లోపం వంటి అంశాలపై దృష్టి సారించారు. గ్రామాభివృద్ధికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను సమర్థంగా వినియోగించుకుంటూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరవేయడమే తమ లక్ష్యమని సర్పంచులు తెలిపారు.

గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలు తీసుకుని, సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న సర్పంచులు, స్వచ్ఛ గ్రామం సమృద్ధి గ్రామమే గణతంత్ర దినోత్సవానికి నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో నర్సంపేట మండల 19 గ్రామపంచాయతీల వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీట‌తీసీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply