Narsampet MLA | ఆదరించి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా
- నల్లబెల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పర్కి సుజాత-త్యాగరాజు
Narsampet MLA | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి గ్రామ ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే నల్లబెల్లి గ్రామాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో నల్లబెల్లికి సైడ్ డ్రైనేజీ సెంటర్ లైటింగ్ పనులను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పరికి సుజాత త్యాగరాజు అన్నారు.
గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో నల్లబెల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పరికి పోటీ చేస్తున్నానన్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడతానని, గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను, అర్హులైన వారికి పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

