Narcotic | గంజాయి ఎక్కడుందో ఇట్టే పసిగడుతా..!

Narcotic | గంజాయి ఎక్కడుందో ఇట్టే పసిగడుతా..!

  • నార్కోటిక్ జాగిలం రోమా తనిఖీలతో హల్ చల్..!
  • గంజాయి నిందితుడి అరెస్టు..!

Narcotic | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : గంజాయి, మాదకద్రవ్యాల నిందితుల ఆట కట్టించేందుకు నార్కోటిక్ జాగిలాలు తనిఖీలతో హడలెత్తిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో పోలీసు శాఖకు చెందిన నార్కోటిక్ జాగిలం రోమా చేత పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇవాళ‌ మధ్యాహ్నం ధనగర్ మైల కాలనీలో గంజాయి నిల్వ‌తో ఉన్న సాహిల్ అహ్మద్ ను జాగిలం రోమా పసిగట్టి పట్టుకుంది. గంజాయి నిర్మూలనకై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో నార్కోటిక్ జాగిలం రొమాతో తనిఖీలు నిర్వహించగా నిందితున్ని పసిగట్టి పట్టుకుంది.

దీంతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని సీఐ బి సునీల్ కుమార్ తెలియజేశారు. గంజాయి సేవించినా, రవాణా చేసినా, దొంగచాటున పంట సాగుచేసినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్ ను రూపొందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగనాథ్, రోమా జాగిలం హ్యాండ్లర్ రమేష్ పాల్గొన్నారు.

Leave a Reply