Narasaraopet | ఎమ్మెల్యేను కించపరిస్తే సహించం

Narasaraopet | ఎమ్మెల్యేను కించపరిస్తే సహించం
- గోపిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంక్షేమ సంఘం
Narasaraopet | నరసరావుపేట, ఆంధ్రప్రభ : రాజకీయ కోణంలో ఎలాంటి విమర్శలు చేసుకున్నా తప్పు లేదని, అయితే బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు (Aravindbabu) పై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శృతిమించి కించపరిచే వ్యాఖ్యలను చేస్తే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు పరోక్షంగా హెచ్చరించారు. సంఘం కార్యాలయంలో ఈ రోజు ఆయన మాట్లాడారు.
మహిళలను కూడా కించపరిచే విధంగా సామెతలను గోపిరెడ్డి (Gopireddy) ఉటంకించటం సబబుగా లేదన్నారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవటం, ప్రజా సమస్యల కోసం పోరాడి ప్రజల పక్షాన నిలబడటం తప్పు కాదని, వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడవద్దని మాత్రమే సూచిస్తున్నామన్నారు. లింగంగుంట్ల భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే అరవింద బాబు రూ.5 కోట్లు డిమాండ్ చేశారని, చేసే ఆరోపణకు ఏదైనా ప్రాతిపదిక గాని, లేదా సాక్ష్యం గానీ ఉండి మాట్లాడితే బాగుంటుందని శ్రీనివాసరావు అన్నారు. ఈ సమావేశం లో పలువురు బిసి నాయకులు పాల్గొన్నారు.
