వరిచేలకు నానో యూరియా స్ర్సే

రైతులతో కలసి కలెక్టర్ పరిశీలన

లింగపాలెం, ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లా లింగపాలెం, లింగపాలెం – కళ్యాణపాడు(Lingapalem – Kalyanapadu) వరి పొలాలల్లో శనివారం డ్రోన్లు(drones)తో నానో యూరియా స్ప్రే కార్యక్రమంలో రైతులతో కలసి ఏలూరు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి(K. Vetriselvi) పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ.. వ్యవసాయాన్నిసులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు సబ్సిడీ(Subsidy)తో ఇస్తున్నదని, ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం(Technological Revolution) డ్రోన్లు ద్వారా ఎరువులు, పురుగు మందులు ఒక్క ఎకరం పొలానికి పిచికారీ కేవలం 5 నిమిషాల్లోనే పూర్తి అవుతుందన్నారు. దీంతో రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతుతోందన్నారు. రైతులకు వరంగా మారిన కిసాన్‌ డ్రోన్లు రైతులు విరివిగా ఉపయోగించుకోవాలని అన్నారు.

యూరియా(Urea) ద్రావణం, సూక్ష్మ పోషకాలు(Nutrients) వంటి ద్రావణ ఎరువులను పిచికారీ చేయడం వల్ల సమర్థత పెరిగి, ఎరువుల(Fertilizers) ఖర్చు తగ్గి రైతులకు డబ్బు, సమయం అదా అవుతుందని అన్నారు. వ్యవసాయానికి డ్రోన్లు చాలా ఉపయోగకరం అని, పర్యావరణంపై రసాయన ప్రభావం తగ్గుతుందని తెలిపారు. కొండ ప్రాంతాలు, బురద ప్రాంతాలు, నీరు నిలిచిన పొలాల్లో సులభతరంగా పిచికారీ అవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ శాఖ(Agriculture Department) అధికారి షేక్ హబీబ్ భాషా, జిల్లా పంచాయతీ అధికారి కె.అనురాధ, డియల్డివో పి.వెంకటరత్నం, తహశీల్దారు యండి.నజీముల్లాషా, యంపిడివో కె.వాణీ, మండల అధికారులు, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply