నంద్యాల పోలీసులు బిజీబిజీ
- 2 లారీలు,16 బైకులు స్వాధీనం
నంద్యాల, ఆంధ్రప్ర బ్యూరో : శాంతిభద్రతల పరిరక్షణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(A cordon and search operation) నిర్వహిస్తున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్(Sunil Sheran) అన్నారు.
ఎస్.పీ ఆదేశాల మేరకు ఆదివారం ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని పోలీస్ అధికారుల సూచనలతో ఆత్మకూరు టౌన్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్ నందు, జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని తరిగోపుల గ్రామంలో, నందికొట్కూరు రూరల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, జూపాడు బంగ్లా ఎస్సై మల్లికార్జున్(SI Mallikarjuna) ఆధ్వర్యంలో కోవెలకుంట్ల సర్కిల్ సంజామల పోలీస్ స్టేషన్ పరిధిలోని కానాల గ్రామంటో కోలకుంట్ల ఇన్స్పెక్టర్, సంజామల ఎస్సై ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రౌడీ షీటర్లు(Rowdy Sheeters), నేరచరిత్రులను, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన ధ్రువపత్రాలు లేని 16 మోటర్ సైకిల్లు సుమారు , 20 క్వాటర్ బాటిల్లు,30 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా గ్రానైట్ ను రవాణా చేస్తున్నరెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల అనంతరం ప్రజలతో సమావేశం నిర్వహించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్(Cybercrime) నేరాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యత, ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించరు.
..ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం, తక్షణ పోలీసు సహాయం కోసం వెంటనే 112 టోల్ ఫ్రీ(Toll Free) నంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందవచ్చునని తెలిపారు.నేర నియంత్రణ, శాంతియాలన్నారు భద్రతల పరిరక్షణ కొరకు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లు నిరంతరం కొనసాగుతుంటాయని ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని సంబంధిత పోలీస్ అధికారులు(Police Officers) కోరారు.
