నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ….. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శభరి అర్ధరాత్రి హల్ చల్ చేశారు. బుధవారం అర్ధరాత్రి జిల్లాలోని వైసిపి వారివి గా చెబుతున్న రెండు గోడౌన్లలో అక్రమంగా దాచి ఉన్న సబ్సిడీ రేషన్ బియ్యాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పట్టుకున్న రు. సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. జిల్లాలోని పాణ్యం మండలం కాటసాని రాంభూపాల్ రెడ్డి గోరుకల్లు తాండ గ్రామంలో అక్రమంగా దాచి నిల్వ ఉంచిన 500 క్వింటాళ్ల బియ్యము, అది నియోజకవర్గంలోని పాణ్యం మండలంలో తమ్మరాజు పల్లె గ్రామంలో అక్రమంగా నిర్వహించిన 1000 క్వింటాళ్ల రేషన్ బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ రెండు గ్రామాల్లో వైసీపీ పార్టీకి మంచి పట్టు ఉందని ఆరోపణ.వైసీపీ పార్టీకి చెందిన వారి గొడౌను లలో ఉన్న రేషన్ బియ్యం ను చూసి అవాక్కయిన ఎంపీ. ఈ సందర్భంగా శబరి మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా వైసీపీ నేతల అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగటం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ రేషన్ బియ్యం తందా వైసీపీ నాయకులకు సంబంధించినదేనని, వీరిపై కఠిన చర్యలు తప్పకుండా చేసుకుంటామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
జిల్లాలో ఎటువంటి అక్రమ రేషన్ బియ్యం గొడౌన్ లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి నాయకులు ప్రజల సొమ్మును దోచుకు తిన్నారిని ఆరోపించారు. మా ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంకా వైసిపి నాయకులు దందా కొనసాగటమేంటీ అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా రేషన్ బియ్యం ఈ గొడౌన్ ల లో ఉంటే అధికారులకు తెలియదా అనుపమ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు వచ్చిన సమాచారం మేరకు అర్ధరాత్రి అయినా అధికారులను పిలిపించుకొని క్షణం దాటితే తిరిగే రేషన్ బియ్యం మాయమైతాయని గ్రహించి ఎం. పి. గొడౌన్ ల దగ్గరికి వెళ్లి స్వయంగా అధికారులతో తనిఖీ చేశారు.
1500 క్వింటాళ్ల రేషన్ బియ్యం పాణ్యం ఎమ్మార్వో స్వాధీనం చేసుకున్నారు.ఈ మెరుపు దాడుల్లో సివిల్ సప్లయ్ స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు పాణ్యం ఎస్ ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, సుగాలి మెట్ట విఆర్వో బిరేంద్ర ల సమక్షంలో గోదాముల తాళాలు తీసిన అధికారులు, అక్రమ బియ్యం స్థాక్ నిల్వలను చూసి అవాక్కు అయ్యారు. పోలీసులు సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.