Nandyala | అభ్యుదయ కవి ముర్తుజా కలం మూగబోయంది…

Nandyala | అభ్యుదయ కవి ముర్తుజా కలం మూగబోయంది…

  • ఆయన మరణం సమాజానికి తీరని లోటు.

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా అధ్యక్షులు అభ్యుదయ కవి షేక్ ముర్తుజా మరణం సమాజానికి తీరని లోటని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు భగత్ సింగ్ గ్రంథాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ న్యాయవాది శంకరయ్య తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారన్నారు.అనేక అభ్యుదయ కవితలు అనేక దినపత్రికలలో ప్రచురితమైనాయన్నారు. సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు శ్రమేవ జయతే, జన సారధి శంకరయ్య మరియు ఒక్కడు లాంటి అనేక పుస్తకాలు రచించారని పేర్కొ న్నారు. ముర్తుజా మరణం ప్రజా ఉద్యమకారులకు, ప్రజా రచయితలకు తీరని లోటని, ఒక కలం మూగబోయిందన్నారు.అభ్యుదయం భావాలకు కవితా రూపాలు ఇచ్చే ఒక కలం నేడు లేకపోవటం బాధాకరమన్నారు.వారి అభ్యుదయ భావాలను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత అభ్యుదయ వాసులకు, సాహిత్యలోకానికి ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు కేశవరెడ్డి, నీలకంఠాచారి, రామమూర్తి, మాధవరావు, బాలా గౌడ్ తదితరులు పార్థీవదేహాన్ని సందర్శించి తమ సంతాపాన్ని తెలిపారు.

Leave a Reply