Nandivada | వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

Nandivada | వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది
- షుగర్ డౌన్ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తి
- సకాలంలో వైద్య సేవలు అందించిన 108 సిబ్బంది
Nandivada | నందివాడ, ఆంధ్రప్రభ : నందివాడ మండలం దండిగనపూడి గ్రామంలో శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల నుంచి రాజు అనే వ్యక్తి అపస్మారక స్థితిలో వెళ్లాడు. రాజు(50) బాపులపాడు మండలం ఆరుగోలను గ్రామం నుంచి జీవనాన్ని సాగించేందుకు దండిగానపూడిలో చెరువుపై కాపలా వ్యక్తిగా ఉంటున్నాడు. అపస్మారక స్థితిలో రాజు పరిస్థితి గమనించిన చెరువు యజమాని 108 సిబ్బందికి కాల్ చేయడంతో సత్వరమే స్పందించి హుటాహుటిన దండిగానపూడి చేరుకున్నారు. రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి షుగర్ డౌన్ అయిందని నిర్దారణ చేసుకున్నారు. వైద్యులతో సంప్రదించి, రాజుకు వైద్యం చేశారు.
ప్రథమ చికిత్సలో భాగంగా షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి రాజుకు షుగరు 45 పడిపోవడంతో ఈఆర్సీపీ డాక్టర్ తేజ అనుమతితో డి25 సెలైన్ ఎక్కించారు. కొంత సమయానికి రాజు అపస్మారక స్థితి నుంచి తేరుకున్నాడు. మళ్ళీ కళ్ళు తెరుస్తానని అనుకోలేదని సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. సకాలంలో రావడమే కాకుండ చెరువుపై డాక్టర్ సలహాలు సూచనలతో చేపల చెరువుపై వైద్యం చేసిన 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎర్రంశెట్టి నాగమల్లేశ్వరి పైలెట్ వెలగలేటి సుమన్ అభినందించారు. గుడివాడలో 108 సేవలు అద్బుతమని చెరువు యజమాని రాజారెడ్డి కొనియాడారు.
