Nandikotkur | మత్తుకు బానిసైతే..

Nandikotkur | మత్తుకు బానిసైతే..

Nandikotkur | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మంగళవారం పోలీసులు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పటేల్ సెంటర్ వరకు విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై మీ విలువైన జీవితాలను, తల్లిదండ్రుల కలలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యవంతమైన, వ్యసన రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మించడమే మన ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాన్ని గుండెల్లో నింపుకుని, సమాజ మార్పులో భాగస్వాములు కావాలన్నారు. మన రాష్ట్రం మత్తు రహిత రాష్ట్రం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం వ్యక్తి భవిష్యత్తును, కుటుంబ శాంతిని, సమాజ అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. గంజాయి వాడకం, అమ్మకం చట్టరీత్యా నేరమని, పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని తెలిపారు.

Nandikotkur

డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులతో పాటు ప్రజలందరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల పై శ్రద్ధ పెట్టి మంచి అలవాట్లకు దారి చూపాలని, విద్యార్థులు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి, ఆరోగ్యవంతమైన యువతతో శక్తివంతమైన సమాజ నిర్మాణానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, సీఐలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఎస్సైలు చంద్రశేఖర్ ఓబులేసు, నాగార్జున, మున్సిపల్ కమిషనర్ ఎస్ బేబీ, డిప్యూటీ తాసిల్దార్ సోమేశ్వరి, ఈగల్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply