Nallu Indrasena Reddy | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..

Nallu Indrasena Reddy | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
Nallu Indrasena Reddy | నల్లు ఇంద్రసేనారెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట దర్శనం
ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనం – శేషవస్త్రం అందజేత
పునర్నిర్మాణ వైభవంపై గవర్నర్ హర్షం
బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గవర్నర్ పర్యటన
Nallu Indrasena Reddy | యాదగిరి గుట్ట,ఆంధ్రప్రభ : త్రిపుర (Tripura) రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి గర్భాలయంలో స్వయంభూవులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, మాధవాచార్యుల బృందం శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం అందజేశారు.

దర్శనానంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి జె. భవాని శంకర్ గవర్నర్ (Governer) దంపతులకు స్వామివారి శేషవస్త్రంతో పాటు చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి అధ్యక్షుడు పుట్కూరు అశోక్ కుమార్ గౌడ్, పలువురు స్థానిక బిజెపి నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల క్షేమం కోరి స్వామివారిని దర్శించుకున్నట్లు ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణం అత్యంత వైభవంగా ఉందని, ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరుస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు అశోక్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గవర్నర్ పర్యటన సజావుగా సాగింది.

