న‌ల్ల‌గొండ పోక్సో కోర్టు తీర్పు

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకుని లైంగిక‌దాడికి పాల్ప‌డిన దోషికి 32 సంవత్సరాల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ (Nalgonda) ఫోక్సో కోర్టు న్యాయమూర్తి రోజారమణి ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

2022 లో మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని పానగల్లు కు చెందిన నిందితుడు చందు పై నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పూర్తి సాక్షాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ (Scientific Evidence) పరిశీలించిన అనంతరం నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ. 10లక్షల పరిహారం చెల్లించాలని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు.

Leave a Reply