Nallabelly | పెద్ద మనసుతో విద్యార్థులకు క్రీడా దుస్తుల దానం..

Nallabelly | పెద్ద మనసుతో విద్యార్థులకు క్రీడా దుస్తుల దానం..
రంగాపురం ప్రభుత్వ పాఠశాలలో గోవర్ధన్ దీప్ దంపతుల దాతృత్వం
Nallabelly | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా,నల్లబెల్లి మండలం రంగాపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రతాపగిరి గోవర్ధన్ దీప్ దంపతులు క్రీడా డ్రెస్ మెటీరియల్‌ను దానం చేశారు. ఈ దానం ద్వారా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవచ్చు అని సూచించారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన నల్లబెల్లి మండల విద్యా అధికారి (ఎంఈఓ) అనురాధ,ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యార్హతలు,అనుభవ సమృద్ధి కలిగిన గురువులు విద్యార్థులకు నాణ్య విద్య, సామర్థ్యాలు అందిస్తున్నారని తెలిపారు.
ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించడానికి దాతలు ముందుండాలని పిలుపునిచ్చారు. పెద్ద మనసుతో దానం చేసిన గోవర్ధన్ దీప్ దంపతులను హృదయపూర్వకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ రంగాపురం హెడ్ మాస్టర్ రాజిరెడ్డి, ఉపాధ్యాయురాలు స్వరాజ్యం,జెడ్‌పీహెచ్‌ఎస్ రంగాపురం హెడ్ మాస్టర్ యాకూబ్ రెడ్డి,శ్రీనివాస్ లు ప్రముఖులు ఉన్నారు. ఇలాంటి దాన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో విద్య, క్రీడల అభివృద్ధికి మార్గదర్శకాలుగా మారుతున్నాయి.
