Nallabelly | అభివృద్ధికి కృషి చేస్తా..

Nallabelly | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నారక్క పేట ఏడవ వార్డులో పోటీ చేస్తున్న వార్డు సభ్యురాలు కన్నూరి లత రమేష్ మాట్లాడుతూ… నా గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే, మా వార్డులో ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తాను అని ఓటర్లకు భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమె ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అర్హులైన యువతకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు. ప్రజల మద్దతు, ఆశీర్వాదాలు ఇవ్వాలని ఓటర్లను లత రమేష్ కోరారు.

Leave a Reply