Nallabelli | ఒక్క చాన్స్ ప్లీజ్..
- గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
- కొండాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అబ్బర బోయిన లలిత సురేష్
Nallabelli | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : సామాన్య కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డను, సర్పంచ్‌గా అవకాశమిచ్చి ఆశీర్వదించండని కొండాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒకసారి ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లలిత సురేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారాలతో గ్రామంలో గతంలో చేయని పనులు పూర్తిగా చేస్తానన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తోపాటు, మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. సంవత్సరానికి ఒకసారి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

