Nalgonda | తొలి మేయర్ గా మహిళా ప్రమాణ స్వీకారం..

Nalgonda | తొలి మేయర్ గా మహిళా ప్రమాణ స్వీకారం..

Nalgonda, ఆంధ్రప్రభ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 32 వ డివిజన్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తొలి మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన పాలకవర్గం మరి కొన్ని గంటల్లో ఆశీనులు కానున్న సందర్భంగా అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ బి. శరత్ చంద్ర పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పాటు కావడంతో కార్పొరేషన్ స్థాయిలో మొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలపరిచిన అభ్యర్థులు 27 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు.

48 డివిజనులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 27 మంది, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నలుగురు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తొమ్మిది మంది, ఆలిండియా బ్యాక్వర్డ్ పార్టీ నుండి నలుగురు, ఎం ఐ ఎం నుండి ఇద్దరు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ కు 25 మంది అభ్యర్థులు అవసరం ఉండగా ఏ ఐ ఎఫ్ బీ నుండి గెలుపొందిన ముగ్గురు అభ్యర్థులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో సంఖ్య 30కి చేరింది. మేయర్ అభ్యర్థిగా మంత్రి ఎన్నికల ముందే ప్రకటించడంతో మేయర్ ఎన్నిక సునాశయంగా ఎన్నిక జరగనున్నది. డిప్యూటీ మేయర్ కొరకు పలువురు కార్పొరేటర్లు పోటీ పడడంతో ఉత్కంఠ భరితంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్పొరేటర్లు క్యాంపులో ఉండడంతో మరి కొద్ది గంటలలో నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరునున్నారు.

Leave a Reply