Nalgonda | ఘ‌నంగా ణతంత్ర దినోత్సవ వేడుకలు

Nalgonda | ఘ‌నంగా ణతంత్ర దినోత్సవ వేడుకలు

Nalgonda | నల్గొండ, ఆంధ్రప్రభ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఈ రోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. శరత్ చంద్ర గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి, భారత రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గుర్తించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం,సోదరభావం వంటి విలువలను కాపాడుకుంటూ దేశ ప్రగతికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, ఏసీపీ కృష్ణవేణి, మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి శివరామిరెడ్డి, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply