Nalgonda | ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

Nalgonda | ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
Nalgonda | నల్గొండ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డులోని ప్రసాద్ ఉడుపి హోటల్ లో సాంబార్లో జెర్రీ పడిందని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారి శివారెడ్డి తనిఖీ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎంతో పేరున్న హోటల్అ… లాంటి హోటల్‌లో ఓ జెర్రి హల్చల్ చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రసాద్ హోటల్ లో ఓ కస్టమర్ సాంబార్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. అందులో అంతా అయిపోయాక అడుగుకు ఓ జెర్రి ఉన్నదని బాధితులు తెలిపారు. దీంతో బాధితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఫుడ్ శెట్టి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
