Nagoba Fair | గ్రామాలకు బయలుదేరిన నాగోబా రథం…
Nagoba Fair | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని కెస్లా పూర్ లోని మెస్రం వంశీయుల నాగోబా జాతర(Nagoba Fair) జనవరి 18న పుష్య అమావాస్య రోజున ఆరంభం కానుంది. గత వారం రోజులుగా నాగోబా జాతర పై బయలు దేరిన ప్రచార రథం ఆదివారం వడగావ్ గ్రామంలో బస చేశారు. ప్రధాన్ దాదేరావ్, ఖటోడ (పూజారి), ఆధ్వర్యంలో బయలు దేరిన ఈ రథం ఈ రోజు కేస్లాపూర్ కు చేరుకుంది. వడగావ్ లో గ్రామస్తులు వారి ఆచార సాంప్రదాయం ప్రకారం పూజలు చేసి సాగనంపారు.

అక్కడ మురాడి మడావి ఇంటి వద్ద బస చేస్తారు. మంగళవారం వివిధ గ్రామాల నుంచి మెస్రం వంశీయులు(Mesram Dynasty) కెస్లాపూర్ లోని మురాడి ఆలయం ఆవరణలో కలుస్తారు. సాయంత్రం పవిత్ర గంగా జలం కోసం గోదావరి లోని హస్తినమడుగుకు కాలి నడకన బయలు దేరుతారు.
నాగోబా జాతర ఏర్పాట్ల పై అధికారకంగా సమీక్ష సమావేశం
- జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
అదిలాబాద్ జిల్లాలోనే పేరుగాంచిన కేస్లా పూర్(Keslapur) లోని నాగోబా జనవరి 18 నుంచి 24 వరకు జరగనుందని జిల్లా కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. ఈ జాతర ఏర్పాట్ల పై ఐటీడీఏ, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు 30న ఉదయం 10.30 గంటలకు సకాలములో హాజరు కావాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

