Nagarkurnool | కరెంటు కట్.. సిగ్నల్ ఫట్..

Nagarkurnool | కరెంటు కట్.. సిగ్నల్ ఫట్..
Nagarkurnool వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన జియో టవర్ కి కరెంట్ పవర్ నిలిచిపోవడంతో జియో కస్టమర్లు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో దాదాపుగా 90 శాతం జియో నెట్వర్క్ వినియోగదారులు ఉండడంతో సిగ్నల్ నిలిచిపోవడం వలన యూరియా బుకింగ్ యాప్ తో పాటుగా పోస్ట్ ఆఫీస్ లో పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
అదే తరహాలో ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయులు ఫేస్ క్యాప్చర్, అంగన్వాడి ప్రీ ప్రైమరీ స్కూల్లో అంగన్వాడీ టీచర్స్ విద్యార్థుల అటెండెన్స్, సెంటర్ ఓపెనింగ్, ఫుడ్ వివరాలు వంటివి సమాచారం స్మార్ట్ ఫోన్ ద్వారానే ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా జియో టవర్ సంబంధిత అధికారులు స్పందించి నూతన జనరేటర్ ను ఏర్పాటు చేసి సిగ్నల్ ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
