నాగర్కర్నూల్ జిల్లా అటవీశాఖ కొత్త డీఎఫ్వో రేవంత్ చంద్ర బాధ్యతల స్వీకరణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్కర్నూల్ జిల్లా అటవీశాఖలో కొత్త అధికారిగా రేవంత్ చంద్ర ఐఎఫ్ఎస్ బాధ్యతలు అధికారికంగా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
మునుపటి అధికారులు రోహిత్ గోపిడి రంగారెడ్డి ఇతర జిల్లాకు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో రేవంత్ చంద్ర నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రేవంత్ చంద్ర ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ, జిల్లాలో అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత కాపాడడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అటవీ ప్రాంతాల్లో వృక్ష సంరక్షణ, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భాగస్వామ్యంతో అటవీ సంరక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అటవీ డివిజన్ అధికారులు చంద్రశేఖర్, రామ్మూర్తి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు వీరేష్, దేవరాజ్ పాల్గొన్నారు.
