Nagar Kurnool | అత్యాధునిక వసతులతో…
- పాఠశాల భవన నిర్మాణం…
Nagar Kurnool | నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టేం గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్(Pharma Foundation) వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ పి. శరత్ చంద్ర రెడ్డి సహకారంతో నిర్మితమైన కొత్త ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి(Kuchukulla Rajesh Reddy) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ పాఠశాల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామ అభ్యున్నతికి మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉత్తమ విద్య అందించేందుకు గ్రామాల్లో విద్యా వసతుల అభివృద్ధి అత్యంత అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు.
పిల్లల భవిష్యత్తును వెలుగొందించడానికి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ పాఠశాల ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పాఠశాలకు కూచుకుళ్ల ఫౌండేషన్ ద్వారా గ్రీన్ బోర్డ్స్(Green Boards) అందించారు. గ్రామ అభివృద్ధి, విద్యాభివృద్ధి పట్ల తమ కృతనిశ్చయం కొనసాగుతుందని, మరిన్ని అభివృద్ధి పనులకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ఈ పాఠశాల నిర్మాణానికి సహకరించిన అరబిందో ఫార్మా ఫౌండేషన్(Aurobindo Pharma Foundation)కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వతంత్ర భారత రూపశిల్పి, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు.
పాఠశాల పరిసరాల్లో విద్యార్థులకు సరైన వాతావరణం కల్పించేందుకు అదనపు సౌకర్యాలు కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి, తిరుపతయ్య గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



