Nagar Kurnool : నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలే…
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్( Nagar Kurnool) జిల్లా అచ్చంపేట పట్టణంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ఈ రోజు సాయంత్రం పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎస్సై సద్దాం హుస్సేన్(Saddam Hussein) నేతృత్వంలో అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి.
ఈ సందర్భంగా ఎస్సై సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ.. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోవడంతో పాటు రాష్ డ్రైవింగ్(rash driving) అధికమై, నెంబర్ ప్లేట్ లేని వాహనాల కారణంగా పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర్తించడం ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో నెంబర్ ప్లేట్(number plate) లేని వాహనాలను సీజ్ చేసే చర్యలు చేపట్టాం అని ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు.
ఈ డ్రైవ్లో అచ్చంపేట పట్టణ ఎస్సై 2 ఇందిరా, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొని వాహనాలను తనిఖీ చేసి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనాలపై స్పష్టమైన నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపైకి రాకూడదని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని పట్టణ ఎస్సై సద్దాం హుస్సేన్ ప్రజలకు అవగాహన కల్పించారు.

