NagaBabu | మోడ్రన్‌ దుస్తులు ధరించడం తప్పు కాదు..

NagaBabu | మోడ్రన్‌ దుస్తులు ధరించడం తప్పు కాదు..

శివాజీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన నాగబాబు


NagaBabu | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీ చేసిన కామెంట్స్‌ను నాగబాబు (NagaBabu) తప్పు పట్టారు. సమాజం పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని వాటినుంచి బయటకు రావాలన్నారు. మోడ్రన్‌ దుస్తులు ధరించడం తప్పు కాదన్నారు. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలు వారి డ్రెస్‌ల వల్ల కాదని.. మగవాళ్ల క్రూరత్వం వల్ల అని నాగబాబు అన్నారు.

ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా (Insta) వేదికగా సుదీర్ఘ వీడియో విడుదల చేశారు. ‘‘నేను రాజకీయ నాయకుడిగానో, ఇండస్ట్రీకి చెందిన నటుడిగానో దీనిపై స్పందించడం లేదు.. ఒక సామాన్య వ్యక్తిగా దీని గురించి మాట్లాడుతున్నాను. అలాగని నేను శివాజీని (Sivaji comments) టార్గెట్‌ చేయడం లేదు.. ఒకవేళ మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను.

ఆడపిల్లలు ఎలా ఉండాలి.. వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలి.. ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై ప్రతిఒక్కరూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అలా కామెంట్స్ (comments) చేయడం రాజ్యాంగం ప్రకారం తప్పు. ఆడవాళ్లు ఇలాంటి డ్రెస్‌లు మాత్రమే వేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది. ప్రతి ఆడపిల్లకు ఆత్మగౌరవం ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్‌ అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. ప్రతి ఆడపిల్లను కుటుంబసభ్యురాలిలానే చూడండి. మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకు కూడా ఉంటుంది’’ అని అన్నారు.

Leave a Reply