Muslim| మైనారిటీల అండ‌గా ప్రభుత్వం

Muslim| మైనారిటీల అండ‌గా ప్రభుత్వం

  • మాజీ మంత్రి నెట్టెం రఘురాం
  • జగ్గయ్యపేటలో ముస్లిం మైనార్టీ కమిటీ ఏర్పాటు
  • 17 మందితో కమిటీ నియామకం

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమిటీని మొత్తం 17 మంది సభ్యులతో నియమించినట్లు మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పాటు జరిగిందని ఆయన వెల్లడించారు. కమిటీలో అధ్యక్షులుగా షేక్ అక్బర్, జనరల్ సెక్రటరీగా గాలిబ్ సైదా షేక్, వైస్ ప్రెసిడెంట్లుగా మిరాహుస్సేన్ షేక్, సోనుమియా షేకూ, ఆడమ్ షేక్ తదితరులను నియమించినట్లు పేర్కొన్నారు. మిగిలిన కార్యవర్గ సభ్యులతో కలిసి ఈ కమిటీ మైనారిటీల సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా పనిచేస్తుందని నెట్టెం రఘురాం ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని తెలిపారు. ముఖ్యంగా హజ్ యాత్రకు ఒక్కో యాత్రికుడికి రూ.1 లక్ష రుణ సదుపాయం కల్పించడం పట్ల ముస్లిం సోదరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇది మైనారిటీల ఆధ్యాత్మిక భావాలను గౌరవించే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మైనారిటీల అభివృద్ధి కార్యక్రమాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులు విదేశీ విద్య, విదేశీ ఉద్యోగ అవకాశాలకు ప్రోత్సాహం అందించాలని తమ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరగా, దీనిపై సానుకూలంగా స్పందించిన నెట్టెం రఘురాం తప్పకుండా ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మైనారిటీల సామాజిక, ఆర్థిక పురోగతికి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ విజయవంతంగా పనిచేసి జగ్గయ్యపేట నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a Reply