మ్యూజిక‌ల్ ట్రాన్స్ !!

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ చిత్రం నుంచి సంగీత దర్శకుడు థమన్ ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ పేరుతో ప్రత్యేక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) విడుదల చేశారు. ఈ ట్యూన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన ‘ఓజస్ గంభీర’ పాట అభిమానులను ఉర్రూతలూగిస్తుండగా, తాజాగా ‘Trance of Omi’పేరుతో విలన్ ఇమ్రాన్ హష్మీ పాత్రకు సంబంధించి ప్రత్యేక మ్యూజికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేకమైన ట్యూన్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ ‘గంభీర’ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేస్తున్నారు. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, దాసరి కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply