Murder | యువకుడి దారుణహత్య

Murder | యువకుడి దారుణహత్య

Murder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని టిప్పర్‌తో ఢీకొట్టి అనంతరం రాళ్లతో కొట్టి హత్య చేయడం కలకలం రేపింది.

తెలంగాణ రాష్ట్రంలోని వెల్దండ ప్రాంతానికి చెందిన రుద్రాక్షల మహేశ్ అనే యువకుడు కారులో వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు టిప్పర్‌తో వెంబడించి ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన మహేశ్‌పై దుండగులు మరింత క్రూరంగా దాడి చేసి రాళ్లతో కొట్టి చంపారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply