ఎన్నికల ప్రచారంలో మోటకొండూరు కాంగ్రెస్ నేతలు

ఆలేరు, ఆంధ్రప్రభ : ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకింది మురళి గెలుపు కోసం మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఐదవ వార్డులో జరిగిన ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు కోరుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొంత మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నూతకుండూరు పట్టణ అధ్యక్షులు కొమరయ్య, జిల్లా నాయకులు కుడుదుల సత్యనారాయణ, గట్టికొప్పుల మచ్చేందర్,
మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply