కంటి సమస్యతో ఏ ఒక్కరూ బాధపడకూడదు…

మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడకూడదన్నదే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జాజుల స్వామి గౌడ్ అన్నారు. ఈ రోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం జమస్తాన్‌పల్లి గ్రామంలో ఎమ్మెల్యే తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ పేరుతో ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఉచిత కండ్ల అద్దాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జాజుల స్వామి గౌడ్ మాట్లాడుతూ.. నిరుపేదలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సేవలు అభినందనీయమన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో వృద్ధులకు,అర్హులైన వారికి కండ్ల అద్దాలను అందజేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందుగుల నరసమ్మ యాదయ్య, వార్డు సభ్యులు,కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు, ఆశ వర్కర్,ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply