Munugodu | ప్రాథమిక పాఠశాలకు ఆర్థిక సహాయం

Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు గ్రామ ఉప సర్పంచ్ ఉప్పునుంతల సుగుణమ్మ యాదయ్య గ్రామాభివృద్ధి దిశగా సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవిగూడెం ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల అవసరాల నిమిత్తం రూ. 6,000 విలువైన సౌండ్ బాక్స్, వైర్లెస్ మౌత్ పీస్ ను ఆమె అందజేశారు.

అలాగే 12వ వార్డు మెంబర్ సద్దల కళ్యాణి శ్రీశైలం పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల పంపిణీ కోసం రూ.3,000 నగదు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.

గ్రామ అభివృద్ధి, విద్యాభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్న ప్రజాప్రతినిధులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గుంటుక ధన భార్గవి, ఉపాధ్యాయులు గొడ్డటి నరసింహ, మిర్యాల మురళి, కట్ట వెంకన్న, గ్రామస్తులు ఉప్పునూతల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply