Munugodu | కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి

Munugodu | కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, ఎన్నికలు అయిపోయాక అందరూ కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. ఇవాళ మునుగోడు మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డ్ మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మునుగోడు గ్రామంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్, ఉప సర్పంచ్ ఉప్పునూతల సుగుణమ్మ, వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి పలు సూచనలు చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. ఎవరు ఏ నాయకుని వెంట ఉన్నా… గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. గ్రామంలో పార్టీలకతీతంగా నిరుపేదలైన అర్హులకు ప్రభుత్వ సంక్షేమాలు అందించడంలో సర్పంచ్ ముందుండాలన్నారు.

మన పార్టీ కాదు.. అవతల పార్టీ అని ఏ ఒక్కరు కూడా అర్హులైన నిరుపేదలను విస్మరించవద్దని కోరారు. గ్రామాభివృద్ధిలో ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత, ఉమ్మడి నల్లగొండ డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నారబోయిన రవి ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
