ఆదర్శ మున్సిపల్‌గా తీర్చి దిద్దుతా

ఆదర్శ మున్సిపల్‌గా తీర్చి దిద్దుతా

  • మంత్రి వివేక్

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాల్టీని అన్ని అంగుల తో ఆదర్శ మున్సిపాల్టీ గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ఇవ్వాళ స్థానిక మున్సిపల్ కార్యాలయం లో నూతన పాలకవర్గం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే పట్టణంలో 50కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేశామని, వార్డుల్లో అనేక బోరు పంపులు, సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజ్ల నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయన్నారు. పట్టణంలో కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయించడం జరిగిందని, మే నెలలో 100పడకల ఆసుపత్రి ప్రారభించునున్నట్లు పేర్కొన్నారు. కోటి ఇరువై లక్షలతో స్మశాన వాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, చెన్నూరులోని ప్రతివార్డులో సమన్వయంతో అభివృద్ధి పనులు చేపడుతమన్నారు.

Leave a Reply