వెంకన్న ఎన్నిక గర్వకారణం..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పల్లెర్ల వెంకన్న ఎన్నిక కావడం ఆర్యవైశ్య సంఘానికి గర్వకారణం అని ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు మొగుళ్ళపల్లి సోమయ్య అన్నారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 1 వ వార్డ్ కౌన్సిలర్గా విజయం సాధించి వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పల్లెర్ల వెంకన్న గుప్తా ను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పూలమాలలు ,శాలువలతో ఘనంగా సన్మానించి మెమోంటో అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మొగుళ్లపల్లి సోమయ్య మాట్లాడుతూ వైస్ చైర్మన్ వెంకన్న పేదరికంలో పుట్టి పెరిగి ఎన్నో కష్టాలను అనుభవించి, ఎన్నో సమాజ సేవా కార్యక్రమాల ద్వారా ఈ స్థాయికి వచ్చి, 1 వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని స్వీకరించడం గర్వకారణమని, అభినందనీయమన్నారు.

ప్రజల కష్టాలు తెలిసిన వెంకన్న ఇంకా ముందు ముందు ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్యవైశ్య ప్రతినిధులు వెంకన్నకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి,మోత్కూర్ వర్తక సంఘం అధ్యక్షులు సోమ వెంకటేశ్వర్లు, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సోమ సంతోష్ కుమార్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు గుండా రాములు, పట్టణ కోశాధికారి బుక్క విశ్వనాథం, నరేందర్,వీరవెల్లి ప్రవీణ్ కుమార్, బుస్స రవి, సోమ నర్సయ్య, బండారు ప్రసాద్,మిట్టపల్లి నాగేష్,మాశెట్టి వెంకన్న , అనంతుల వెంకటేశ్వర్లు, అశోక్, రంగయ్య, దామెర వాసు, సోమయ్య, వెంకన్న, మురారిశెట్టి శ్రీధర్, గుజ్జ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply