Municipal | మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయాలి

Municipal | మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగరవేయాలి
Municipal | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ధర్మాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్క హిందువు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కోరారు. సోమవారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసగృహం నుండి ప్రరంభమైన ర్యాలీ బైల్ బజార్. బుధవార్ పేట్పా త బస్టాండ్ మీదుగా కొనసాగి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. కలిసి ఆయన మాట్లాడారు.
ఎంఐఎం నాయకులు మత విద్వేష వ్యాఖ్యలు చేస్తే సహించం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ మద్దతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ పట్టణంలో కార్నర్ మీటింగ్ ఇంత పెద్ద మొత్తంలో జనాలు రావడం చూస్తుంటే నిర్మల్ మున్సిపాలిటీ గడ్డపై పక్కా బీజేపీ జెండా ఎగరవేయడం తధ్యమని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, ధర్మాన్ని గెలిపించాలని నిర్మల్ ను కాపాడాలని బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత పాలకులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించి, స్వంత ప్రయోజనాల కొరకు ఎన్నో అవినీతి పనులు చేశారని అన్నారు.

ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒకవైపు, (కాంగ్రెస్,BRS, MIM) పార్టీలు ఒకవైపు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది ఖచ్చితంగా MIM ఖాతాలోకి వెళ్తుందని అన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక వర్గానికే కొమ్ముఖాయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాట్లాడుతూ ముస్లిం అంటే కాంగ్రెస్ – కాంగ్రెస్ అంటే ముస్లిం అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
